నా ఫ్యామిలీలో 11 మంది కరోనా బారిన పడ్డారు : బుద్ధా వెంకన్న

-

తన కుటుంబంలో 11 మంది కరోనా బారిన పడి కోలుకున్నారని ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొందన్న ఆయన ఒక ప్రజా ప్రతినిధి అయిన తనే వైద్యం చేయించుకోవడానికి అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తే మరి సామన్యుల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వారిని ఆదుకోవడంలో ఎందుకు చిన్నచూపు చూస్తుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించడం మీద చూపిన శ్రద్ధ కరోనా బాధితుల మీద ప్రభుత్వం ఎందుకు చూపించడం లేదని ఆయన విమర్శించారు.

budda venkanna

ఆంధ్రప్రదేశ్ కేసుల సంఖ్యలో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి వెళుతుందని, భవిష్యత్ లో పరిస్థితిని ఊహించుకుంటే భయానకంగా ఉందని అన్నారు. కరోనా బాధితుల కోసం ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, కళ్యాణ మండపాలు, స్టేడియంలు క్వారంటైన్ సెంటర్లుగా మార్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన కోరారు. ప్రాణాలు కోల్పోయిన ఫ్రంట్ లైన్ వారియర్స్ కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం అందించాలన్న ఆయన కరోనా బాధితులకు రూ.2 వేలు ఇవ్వడం కొనసాగించాలని కోరారు. ప్రజలు ఇంతటి ఆపదలో ఉంటే నిస్సిగ్గుగా పన్నులు, చార్జీలు పెంచటం వంచన కాదా? అని ఆయన ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లు తెరిచి పౌష్టికాహారం అందించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version