బ‌డ్జెట్ 2019 ప్ర‌కారం.. ధ‌ర‌లు పెర‌గ‌నున్న‌, త‌గ్గ‌నున్న వ‌స్తువులు ఇవే..!

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ పార్ల‌మెంట్‌లో 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ధ‌ర‌లు పెర‌గ‌నున్న‌, త‌గ్గ‌నున్న వ‌స్తువుల వివ‌రాల‌ను కూడా ఆమె వెల్ల‌డించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇవాళ పార్ల‌మెంట్‌లో 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విదిత‌మే. కాగా ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ధ‌ర‌లు పెర‌గ‌నున్న‌, త‌గ్గ‌నున్న వ‌స్తువుల వివ‌రాల‌ను కూడా ఆమె వెల్ల‌డించారు. కాగా ఈ సారి పెట్రోల్‌, డీజిల్‌, బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా పెర‌గ‌నుండ‌గా, మ‌రికొన్ని వ‌స్తువులపై ప‌న్నులు కూడా బాగా విధించ‌నున్నారు. దీంతో ఆయా వ‌స్తువుల ధ‌ర‌లు కూడా పెర‌గ‌నున్నాయి.

ఇక డీజిల్‌, పెట్రోల్‌ల‌పై రూ.1 వ‌ర‌కు ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతున్న‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. అలాగే బంగారంపై క‌స్ట‌మ్స్ సుంకాన్ని 10 నుంచి 12.50 శాతం వ‌ర‌కు పెంచ‌నున్నారు. దీంతో బంగారం, వెండి ధ‌ర‌లు కూడా పెర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ సారి ధ‌ర పెర‌గ‌నున్న‌, త‌గ్గ‌నున్న వ‌స్తువుల వివ‌రాల‌ను కింద తెలుసుకుందాం.

ధ‌రలు తగ్గ‌నున్న వ‌స్తువులు ఇవే…

నాఫ్తా
గృహ రుణాలు
రక్షణ సామగ్రి
రిఫ్రిజిరేటెడ్ హీలియం లిక్విడ్
సిలికా రాడ్లు, ట్యూబులు
టెక్స్‌టైల్
ఉన్ని వస్తువులు
స్టీల్
మొబైల్ ఫోన్ల కెమెరాలు
మొబైల్ ఫోన్ల ఛార్జర్లు
లిథియమ్ అయాన్ బ్యాటరీలు
సెట్‌టాప్ బాక్సులు
ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు

ధరలు పెర‌గ‌నున్న వ‌స్తువులు ఇవే…

బంగారం
జీడిపప్పు
రసాయనాలు
ప్లాస్టిక్, పీవీసీ పైపులు
రబ్బర్
ప్లాస్టిక్స్ ఫ్లోర్ కవర్లు
న్యూస్‌ప్రింట్
ప్రింటెడ్ బుక్స్
సెరామిక్ ఉత్పత్తులు
సెరామిక్ రూఫింగ్ టైల్స్
స్టీల్, మెటల్ ఉత్పత్తులు
స్టెయిన్‌లెస్ ఉత్పత్తులు
లౌడ్‌స్పీకర్లు
ఏసీలు
సీసీటీవీ కెమెరా
ఆప్టికల్ ఫైబర్
గ్లాస్ అద్దాలు
దిగుమతి చేసుకునే పుస్తకాలు
మ్యాగజైన్లు
వాహనాల లైట్లు
సిగరెట్లు
హుక్కా, గుట్కా, జర్దా ఉత్పత్తులు
పెట్రోలియం ఉత్పత్తులు
పెట్రోల్
డీజిల్

Read more RELATED
Recommended to you

Exit mobile version