BUDGET 2023: ట్యాక్స్ రిలీఫ్ నుండి జాబ్స్ వరకు.. ప్రజలు కోరుకుంటున్న 5 కీలక అంశాలు ఇవే…!

-

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌పై అంచనాలు ఎక్కువగా వున్నాయి. చాలా మంది వాళ్లకి ఉపశమనం వస్తుందని ఆశలతో చూస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వం ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తోంది. అయితే యూనియన్ బడ్జెట్ 2023 నుంచి ప్రజలు కోరుకుంటున్న ఐదు కీలక అంశాలు ఇవే. ఇక మరి పూర్తి వివరాలలోకి వెళ్ళిపోదాం.

ఆదాయ పన్ను చట్టంలోని 80సీ, 80డీ పరిధిలో ట్యాక్స్ బెనిఫిట్స్ ని పొందాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ట్యాక్స్ స్లాబులను మార్చడం, ట్యాక్స్ రేట్లను తగ్గించడం కూడా ఉంటే బాగుంటుందని చూస్తున్నారు. అయితే పన్ను స్లాబ్‌ల్లో భారీగా మార్పులు చేస్తారని ఇప్పటికే అంతా భావిస్తున్నారు. అలానే 2023 బడ్జెట్‌ లో దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా కేటాయింపులు వుంటాయని అంచనా.

కేంద్రం తీసుకొచ్చిన ప్రముఖ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సెంటివ్ పాలసీ కొత్త వాటికీ కూడా కల్పిస్తారని అంచనా. అలానే దేశీయ తయారీ రంగానికి భారీగా ప్రోత్సాహకాలు వస్తాయని అంటున్నారు. గతం లో గ్రామీణ భారతం, సంక్షేమ పథకాల కేటాయింపులపైనా ఫోకస్ చేసారు.

ఇప్పుడు 2024లో సార్వత్రిక ఎన్నికలు కనుక ప్రస్తుత మోదీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలు, సంక్షేమ వ్యయాలపైనే ప్రధానంగా ఖర్చు చెయ్యచ్చని… న్యూ గోల్డ్‌మ్యాన్ సాచ్ నివేదిక ద్వారా తెలుస్తోంది.
అలానే ఉపాధి కల్పనలో మౌలిక వసతులే కీలక భూమిక పోషిస్తాయి. కనుక దీని మీద కూడా ఫోకస్ చెయ్యచ్చు. 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్ కోసం భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం పునరుత్పాదక ఇంధన వనరులలకు బడ్జెట్ లో మార్పులు చెయ్యచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version