కేంద్ర బడ్జెట్ 2025-26 ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు రంగాలకు, వేతన జీవులకు, రైతులకు, వెనకబడిన తరగతులకు చెందిన మహిళలకు, విద్యారంగానికి శుభవార్త చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యమైన కీలక అంశాలను ఒకసారి పరిశీలిస్తే..
01.వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం
02.కోటి 70 లక్షల మంది రైతులకు లబ్ది
03.కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి 3 నుంచి 5 లక్షలకు పెంపు
04.7కోట్ల 70లక్షల మందికి KCC ల ద్వారా లబ్ది
05.కొత్తగా పీఎం ధన్ ధాన్య యోజన
06.వరల్డ్ ఫుడ్ బౌల్ గా భారత్ ను తీర్చిదిద్దడమే లక్ష్యం
07.బిహార్ లో మఖానా బోర్డ్ ఏర్పాటు
08.MSME రుణాలు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంపు
09.స్టార్టప్ ల రుణాలు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంపు
10.టాయ్స్ తయారీకి ప్రత్యేక పథకం
11.బీహార్ లోని పాట్నా ఐఐటీ విస్తరణకు నిర్ణయం
12.విద్యారంగంలో AI వినియోగం
13.అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు
14.ప్రభుత్వ స్కూళ్లకు బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు
15.సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు
16. 50 ఏళ్ల వరకూ వడ్డీ రహిత రుణాలు
17.రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల రుణాలు
18.గిగ్ వర్కర్లకు హెల్త్ ఇన్సూరెన్స్
19.కొత్త ఉడాన్ స్కీన్ – 120 రూట్లలో విమాన సర్వీసులు
20.వచ్చే ఐదేళ్లలో 75వేల మెడికల్ సీట్లు
21.బిహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్
22.పరిశ్రమల ఏర్పాటుకోసం నేషనల్ మాన్యుఫ్యాక్చరింగ్ మిషన్
23.వచ్చే వారంలో కొత్త ఇన్ కం ట్యాక్స్ బిల్లు
24.అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ కేర్ సెంటర్లు
25.ఇన్సూరెన్స్ సెక్టార్ లో వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి
26.ప్రస్తుతం 74 శాతంగా ఉన్న విదేశీ పెట్టుబడుల వాటా
27.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం రూ.500 కోట్లతో 3 కేంద్రాల ఏర్పాటు
28. 36 రకాల లైఫ్ సేవింగ్ మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు
29.షిప్ బిల్డింగ్ కోసం కొత్త ఎకో సిస్టమ్ ఏర్పాటు