Union Budget 2023-24 : వ్యవసాయ రుణాలకు ₹20లక్షల కోట్లు

-

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బడ్జెట్‌పై ఆమె ప్రసంగిస్తున్నారు. శ్రీఅన్న పథకం ద్వారా చిరుధాన్యాల రైతులకు ప్రోత్సాహం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

‘‘7 ప్రాధాన్య అంశాలుగా ఈ బడ్జెట్‌ ఉంటుంది. మొదటి ప్రాధాన్యత.. సమ్మిళిత వృద్ధి. ఆత్మనిర్భర క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌ ప్రకటిస్తున్నాం. రూ.20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు అందిస్తాం. పీఎం మత్స్యసంపద యోజనకు అదనంగా రూ.6 వేల కోట్లతో ప్రత్యేక పథకం తీసుకొస్తాం. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి మరింత ప్రాధాన్యత పెంచుతాం. వ్యవసాయ స్టార్టప్‌ల ప్రోత్సాహకానికి ప్రత్యేక నిధులు ఇస్తాం. మత్స్యరంగానికి రూ.6 వేలకోట్లు. 157 నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తాం’’ అని నిర్మల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news