త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు ఈ సమావేశాలు నెలరోజులపాటు జరిగే అవకాశం ఉన్నది. కాగా దీని కంటే ముందే జగన్ అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు వైసిపి పార్టీ వర్గాల్లో టాక్. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ మొత్తం ఆధారాలతో సహా బయట పెట్టబోతున్నారట. చంద్రబాబు నాయుడే కీలక నేరస్తుడిగా ఆధారాలతో సహా జగన్ చూపించబోతున్నట్లు వైసిపి పార్టీ వర్గాల్లో మాటలు వినబడుతున్నాయి.
ఇటువంటి తరుణంలో ఐటి అధికారులు తాజాగా జరిపిన సోదాల్లో చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి నుండి రెండు వేల కోట్ల రూపాయలు పట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం ఇప్పుడూ దేశ మరియు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద హైలెట్ న్యూస్ గా మారింది. ఇదే సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన చేపట్టడం జరిగింది. మోడీని కలిసిన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ప్రత్యేకంగా జగన్ భేటీ కాబోతున్నారు.
ఇటువంటి నేపథ్యంలో చంద్రబాబు కు సంబంధించిన కేసుల విషయాలు వీరిద్దరి మధ్య చర్చకు రాబోతున్నట్లు సమాచారం. కాగా బడ్జెట్ సమావేశాల ముందు రోజు బాబుకు సంబంధించిన అవినీతి ఆధారాలు మొత్తం అంతా ఎల్ఈడి స్క్రీన్ లో అందరికీ అర్థమయ్యే రీతిలో రెడీ చేయమని పార్టీ నేతలకు జగన్ సూచించారట. కాగా ప్రస్తుతం సంచలనం అయినా రెండు వేల కోట్ల కేసు విషయం పై చంద్రబాబు భయంకరమైన టెన్షన్ లో ఉన్నట్లు టిడిపి వర్గాల్లో టాక్.