సాధారణంగా వాహనాలను మనుషులే డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఒక్కోసారి చిన్న పిల్లలు సైతం బైక్స్, కార్లు డ్రైవ్ చేసి అందరినీ షాక్ కు గురిచేస్తుంటారు. ఇటీవలి కాలంలో రోబోలు కూడా కార్లు, బైకులు,యుద్ధ విమానాలను సైతం నడిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ నేటికీ వైరల్ అవుతున్నాయి.
ఇదిలాఉంటే, తాజాగా స్కూటీని ఓ ఎద్దు నడిపింది. ఉత్తరాఖండ్-రిషికేశ్‌లోని గుమానీ వాలా సమీపంలో వింత ఘటన చోటుచేసుకుంది. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న స్కూటీపై ఎక్కిన ఎద్దు.. అలా కొంతదూరం స్కూటీ రోడ్డుపై నడిపిస్తూ వెళ్లింది.అనంతరం ఓ ఫ్లాట్‌ఫామ్‌ను ఢీకొని కింద పడిపోయింది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్కూటీ నడిపిన ఎద్దు…!
ఉత్తరాఖండ్-రిషికేశ్‌లోని గుమానీ వాలా సమీపంలో వింత ఘటన.
రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న స్కూటీపై ఎక్కిన ఎద్దు.
అలా కొంతదూరం స్కూటీ రోడ్డుపై వెళ్లాక.. ఓ ఫ్లాట్‌ఫామ్‌ను ఢీకొని కింద పడిపోయిన వైనం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో pic.twitter.com/QBHEeVYLWX— ChotaNews App (@ChotaNewsApp) May 3, 2025