సిద్దిపేటలో దళిత యువకుడిపై దాడి.. ఎందుకంటే?

-

సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత యువకుడిపై హిందు సంఘాల వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలోని వేచరేణి గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

అయితే, సదరు దళిత వ్యక్తి గ్రామంలోని ఆల‌యాల‌ను ధ్వంసం చేశాడ‌ని హిందూ సంఘాల వ్యక్తులు ఆరోపించారు. దళిత వ్యక్తపై దాడి ఘ‌ట‌న‌ను ద‌ళిత సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అతనిపై దాడులకు పాల్పడిన నిందితుల‌పై వెంటనే చ‌ర్యలు తీసుకోవాల‌ని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, దళిత వ్యక్తిని కట్టేసి దాడులకు పాల్పడి రోడ్డుపై తీసుకెళ్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news