సింహాచలం ఆలయంలో బయటపడిన తప్పిదాలు

-

ఏపీలోని సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో ఇటీవల ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఏడుగురు భక్తులు మృతి చెందారు. గోడ కూలడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. కాగా, ఆగమశాస్త్రం, వైదిక సూచనలను టూరిజం ఈఈ, సింహాచలం దేవస్థానం ఈఈ పాటించలేదని తెలుస్తోంది. పండితులు సూచించినా మాట వినకుండా ప్రసాద్ స్కీమ్‌లో అధికారులు పనులు చేపట్టినట్లు సమాచారం.

తరతరాలుగా సింహాచలం అప్పన్న మాడవీధులలో తిరుగుతూ సొరంగ మార్గం నుంచి పుష్కరిణికి వెళ్లే దారిని ఇంజినీర్లు మూసివేయించారని.. సొరంగ మార్గానికి అడ్డుగా నిర్మించిన గోడ సైతం కూలిపోయినట్లు తెలిసింది.మూడు నెలల క్రితం సొరంగ మార్గాన్ని కూల్చి బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఇంజనీర్లు రోడ్లు వేయగా.. తరతరాలుగా వస్తున్న స్వామివారి మార్గాన్ని అధికారులు డైవర్ట్ చేయించినట్లు సమాచారం. వైదిక సూచనలు పాటించకుండా అధికారులు నిర్మాణాలు చేపట్టారని త్రిసభ్య కమిటీకి పండితులు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news