స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు బంపర్ ఆఫర్…!

-

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఎకౌంట్ ఉందా..? అయితే మీకు గుడ్ న్యూస్. అయితే మరి దీని కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి. వివరాల లోకి వెళితే.. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. అదిరిపోయే ఆఫర్ల తో ఖాతాదారుల ముందుకు వచ్చింది. దీనిలో భాగంగా యోనో సూపర్ సేవింగ్ డేస్ ఆఫర్ తీసుకు వచ్చింది. దీనిని కనుక ఉపయోగించుకుంటే భారీ తగ్గింపు వస్తుంది.

ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు ఎస్‌బీఐ యోనో సూపర్ సేవింగ్ డేస్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దీనితో ఈ నాలుగు రోజులు కూడా అదిరిపోయే ఆఫర్లని కస్టమర్లు పొందొచ్చు. ఇక బెనిఫిట్స్ విషయం లోకి వస్తే….. ఇక ఓయో ద్వారా రూమ్స్ బుకింగ్‌పై ఏకంగా 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అలానే ఫ్లైట్ బుకింగ్‌ పై 10 శాతం డిస్కౌంట్ ఉంటుంది. యాత్రా.కామ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

ఇది ఇలా ఉండగా ట్యాబ్లెట్స్, వాచ్‌లు, శాంసంగ్ మొబైల్స్‌పై 15 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. అలానే పెప్పర్‌ఫ్రై ద్వారా ఫర్నీచర్ కొనుగోలు చేస్తే 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అమెజాన్‌ లో పలు కేటగిరిపై కూడా ఆఫర్లు ఉన్నాయి గమనించండి. ఓయో రూమ్స్‌ పై 50 శాతం ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్లని మీరు కూడా పొందాలంటే దీని కోసం ఎస్‌బీఐ కస్టమర్లు ముందుగా యోనో యాప్‌ లో లాగిన్ అవ్వాలి. తర్వాత షాప్ అండ్ ఆర్డర్ ‌పై క్లిక్ చేయాలి. ఇలా ఫ్యాషన్ అండ్ లైఫ్‌లైఫ్‌ లోకి వెళ్లి మీకు నచ్చిన వాటిని పొందండి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version