ఐపీఎల్ లో ఎంతో సక్సెస్ ఫుల్ గా ముంబై ఇండియన్ లో కొనసాగుతున్న స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించి టీం ను ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. ఇక వచ్చే సంవత్సరం జరగనున్న ఐపీఎల్ సీజన్ 2024 కు అన్ని జట్లు ముస్తాబవుతున్నాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ముంబై జట్టుకు భారీ షాక్ తగిలేలా ఉందని క్రికెట్ వర్గాలు అనుకుంటున్నాయి. ముంబై ఇండియన్స్ ను బుమ్రా వీడడానికి చూస్తున్నట్లుగా కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం కూడా లేకపోలేదు ఇటీవల బుమ్రా ట్విటర్ మరియు ఇంస్టా లో ముంబై ఇండియన్స్ అన్ ఫాలో చేయడమే అంటున్నారు.
ఇది కాకుండా బుమ్రా RCB తోనూ టచ్ లో ఉంటుండడంతో ఈ అనుమానం ఇంకా బలపడింది. బుమ్రా కనుక ముంబై కి దూరమైతే బౌలింగ్ వీక్ అవ్వడం ఖాయం. మరి ఈవార్తలో ఎంతవరకు నిజం ఉందొ తేలిపోయాలంటే డిసెంబర్ 12 వరకు ఆగాల్సిందే.