కోల్ కతాలో నోట్ల కట్ల వర్షం..

-

కోల్ కతాలో ఓ బిల్డింగ్ నుంచి నోట్ల వర్షం కురవడం కలకలం సృష్టించింది. వివ‌రాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ భవనం నుంచి బుధవారం మధ్యాహ్నం.. నోట్ల వర్షం కురిసింది. అంతస్తు నుంచి కిందపడుతోన్న నోట్లను పట్టుకునేందుకు జనం ఎగబడ్డారు. ముందు పడుతోన్న నోట్లను చూసి షాక్‌ అయిన జనాలు కాసేపటికే తేరుకుని నోట్లను ఒడిసి పట్టుకున్నారు. ఓ భవనంలోని అంతస్తు నుంచి నోట్ల కట్టలను విసిరేస్తున్న దృశ్యాలను వీడియో చిత్రీకరించారు. ఈ ఘటన నగరంలోని బెంటిక్ స్ట్రీట్‌లో చోటు చేసుకుంది.

బిల్డింగ్‌లోని ఆరో అంతస్తులో హోక్యూ మర్కన్ టైల్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఉంది. 2019, 21వ తేదీ బుధవారం డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో సంస్థలో ఉన్న కొందరు రూ. 2 వేలు, రూ. 500, వంద నోట్ల కట్టలను బయటకు విసిరేశారు. దీనిని కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. కిందపడిన నోట్లను పలువురు సేకరిస్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news