బిజినెస్ ఐడియా: ఎర్ర చందనంతో అదిరే లాభాలు.. లక్ష పెట్టుబడితో రూ.60 లక్షలు వస్తుంది..!

-

మీరు ఏదైనా బిజినెస్ చెయ్యాలనుకుంటున్నారా..? అయితే మీకోసం బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ ఐడియా ని కనుక ఫాలో అయితే మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఈ మధ్య కాలం లో చాలా మంది వ్యవసాయం చేస్తున్నారు. పైగా మంచిగా సంపాదిస్తున్నారు కూడా. ఇక ఈ బిజినెస్ ఐడియా గురించి చూస్తే.. ఎర్రచందనాన్ని సాగు చేసి మంచిగా లాభాలను పొందవచ్చు.

పంట దిగుబడికి సమయం పట్టినా ఇతర పనులు చూసుకుంటూ వీటిని సాగు చేయొచ్చు. దీని కోసం మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఏకంగా 60 లక్షల వరకు సంపాదించవచ్చు. గంధం చెక్కల కి మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది. తక్కువ సమయంలో కోట్లాది రూపాయల లాభం ద్వారా మనం పొందొచ్చు. చాలా మంది గంధపు చెక్కలను సాగు చేసి విజయం సాధించారు.

గంధం చెక్కలను సేంద్రియ విధంగా సాగు చేయొచ్చు లేదంటే సాంప్రదాయ పద్ధతిలో కూడా చేయొచ్చు. గంధం చెట్లు సేంద్రియ విధంగా సాగు చేయడానికి పది నుండి పదిహేను సంవత్సరాలు పడుతుంది. సాంప్రదాయ పద్ధతిలో పెరగాలంటే 20 నుంచి 25 సంవత్సరాలు పడుతుంది.

రైతులు ఎన్నో రకాల పంటలు పండించినా వీటికి ధర ఎక్కువ పలుకుతుంది. ఇతర మొక్కలతో పోల్చుకుంటే ఇది ఖరీదైనవి కూడా. ఒక మొక్క సగటు ధర 400 రూపాయలు ఉంటుంది 200 మొక్కలు 80 వేలు ఖర్చు పెట్టి కొనాల్సి ఉంటుంది. ఐదెకరాల భూమి ఉంటే ఒక ఎకరంలో గంధపు మొక్కలు మిగతా భూమిలో ఇతర పంటలు కూడా మీరు వేసుకోవచ్చు. మనదేశంలో గంధం చెక్క ధర కిలో 8 నుంచి 10 వేల వరకు పలుకుతోంది. ఇలా మీరు గంధం చెట్లు ద్వారా లక్షల్లో ఆదాయాన్ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version