మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా..? దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియా ని చూడాల్సిందే. ఈ బిజినెస్ ఐడియా ని అనుసరించడం వలన మంచిగా డబ్బులు వస్తాయి పైగా ఎటువంటి రిస్క్ కూడా ఉండదు.
ఈ మధ్యకాలంలో చాలా మంది ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని భావిస్తున్నారు కానీ ఏ వ్యాపారం చేయాలి అనేది తోచడం లేదు. మీకు కూడా అలానే అనిపిస్తుంటే ఈ వంట నూనె వ్యాపారాన్ని చేయొచ్చు. ఎక్కువ ఆదాయం పొందడానికి అవుతుంది. గ్రామంలో అయినా నగరంలో అయినా ఈ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది ఈ వ్యాపారం కోసం మీ దగ్గర మీడియం సైజ్ మిషన్ ఉండాలి. కావాలంటే లాభాలు వచ్చిన తర్వాత మీరు పెద్ద మిషన్ ని కొనుగోలు చేయొచ్చు. అయితే ఆయిల్ తయారు చేసే మిషన్ రెండు లక్షలు వరకు ఉంటుంది.
ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి మీకు లైసెన్స్ కావాలి అలానే కొన్ని ప్రభుత్వ పత్రాలను కూడా సేకరించాల్సి ఉంటుంది. ఎలా చూసుకున్నా ఈ వ్యాపారం కోసం మూడు నుండి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. మీరు ఆయిల్ని ఎలా తయారు చేయాలి అనేది యూట్యూబ్ లో కానీ తెలిసిన వాళ్ళ ద్వారా కానీ నేర్చుకోవచ్చు.
వేరుశనగ నువ్వులు వంటి ధాన్యాలని మీరు కొనుగోలు చేసి ఆయిల్ తయారు చేసి అమ్మచ్చు ఆయిల్ ని మీరు అవుట్ లెట్ గా కానీ దుకాణదారుల ఒప్పందం ద్వారా కానీ విక్రయించొచ్చు నూనె తయారు చేసిన తర్వాత మిగిలిపోయిన పదార్థాలని కింద విక్రయించొచ్చు. ఎలా చూసుకున్నా 20వేల నుంచి 50 వేల రూపాయలు వరకు నెలకి ఇరవై వేల నుండి యాభై వేల వరకు సంపాదించడానికి అవుతుంది.