బంగాళదుంపలను ఇష్టపడని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా బంగాళదుంపలు అంటే ఎంతో ఇష్టం పిల్లలైతే మరీను. బంగాళదుంప ఫ్రై చేసి పెడితే క్షణాల్లో కాళీ చేసేస్తారు. పైగా మనం బంగాళాదుంపలతో వివిధ రకాల వంటలని తయారుచేసుకోవచ్చు అయితే చాలామందిలో ఉండే సందేహం ఏమిటంటే బంగాళదుంపల్ని షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చా లేదా అని.. మరి షుగర్ ఉన్నవాళ్లు బంగాళదుంపలు ని తినొచ్చా లేదా అనేది ఇప్పుడు చూసేద్దాం. అయితే బంగాళదుంపల రకం, వండే పద్ధతి కూడా ప్రభావితం చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి.
షుగర్ ఉన్నవాళ్లు బంగాళదుంపల్ని తీసుకోవచ్చు. ఎటువంటి హాని కలగదు. కానీ బంగాళదుంపల్ని తినేటప్పుడు బంగాళదుంపల్ని ఎలా వండారు అనేది ముఖ్యం. అలానే ఎంత పోర్షన్ లో మీరు బంగాళదుంపల్ని తీసుకున్నారు అనేది కూడా ముఖ్యం.
కార్బోహైడ్రేట్స్ ని ఎక్కువగా తీసుకోకుండా కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఉడికించుకుని గ్రిల్ చేసుకోవడం మంచిది. బంగాళదుంపలను ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలతో మీరు వండుకోవచ్చు దీనితో డైజేషన్ ప్రాసెస్ నెమ్మది అవుతుంది. దీనివలన షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా ఉంటాయి.
బంగాళదుంపల్లో మీడియం నుండి హై ఇండెక్స్ వరకు ఉంటుంది. అయితే కేవలం గ్లైసిమిక్ ఇండెక్స్ మాత్రమే బ్లడ్ షుగర్ లెవెల్స్ పైన ఎఫెక్ట్ చూపించదు. ఎంత మోతాదులో తీసుకున్నారు అనేది కూడా చాలా ముఖ్యం. అయితే బంగాళదుంపల్ని మీరు తీసుకునేటప్పుడు మాంసం, చేప, గింజలుతో తీసుకోండి. హెల్తీ ఫ్యాట్ అయిన అవకాడో, ఆలివ్ ఆయిల్ వంటి వాటితో తీసుకుంటే ఎటువంటి హాని కలుగదు అని ఆరోగ్య నిపుణలు అంటున్నారు.