బిజినెస్ ఐడియా: ఈ బిజినెస్ తో రూ.40 వేల ఆదాయం..!

-

మీరు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా..? ఆ వ్యాపారం ద్వారా మంచిగా డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు కూడా వదిలేసుకుని చాలా మంది వ్యాపారాలని మొదలు పెడుతున్నారు. మీరు కూడా ఏదైనా వ్యాపారమును మొదలు పెట్టాలనుకుంటున్నారా దాని ద్వారా మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం.

ఈ బిజినెస్ ఐడియాని మీరు ఫాలో అవ్వడం వలన మంచిగా డబ్బులు వస్తాయి పైగా ఎటువంటి ఇబ్బందులు కలగవు. అదే కార్ వాషింగ్ బిజినెస్. కార్ వాషింగ్ ద్వారా మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ బిజినెస్ ని మీరు 22 వేల రూపాయలతో మొదలుపెట్టొచ్చు. 50 వేల వరకు సంపాదించుకోవచ్చు. రోడ్డు పక్కన ఏదైనా చిన్న షాప్ ని అద్దెకి తీసుకొని మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. మెకానిక్ పని వస్తే దీనితో పాటుగా మీరు దాన్ని కూడా చేయొచ్చు లేదంటే ఎవరైనా మెకానిక్ ని పెట్టుకుని కూడా నడిపించవచ్చు.

కార్ వాషింగ్ కోసం ఉపయోగించే మిషన్ 12000 నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. కనీసం 15000 వరకు మీరు మిషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. గ్లవుజులు, షాంపూ మొదలైనవి కావాల్సి ఉంటుంది. ఎక్కువ మంది వచ్చే చోట మీరు దీన్ని పెట్టుకుంటే బాగా క్లిక్ అవుతుంది. పెద్ద పెద్ద నగరాల్లో కూడా మీరు ఈ బిజినెస్ ని చేసుకోవడానికి బాగుంటుంది. ఒక ఏడు ఎనిమిది కార్లకి సర్వీసింగ్ చేస్తే రెండు వేల వరకు వస్తుంది. ఎలా చూసుకున్న నెలకు 50000 వరకు సంపాదించవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news