ఇప్పుడు అందరు క్లీనింగ్ మీదే శ్రద్ధ పెట్టారు. బ్యాంకులు, ఆఫీసుల్లో శుభ్రంగా సానిటైజేషన్ చేయాల్సిన అవసరం చాల వుంది. సానిటైజేషన్ చాలా అవసరం ఉంది. దీనిని మీరు బిజినెస్ గా చేసుకోవచ్చు. సానిటరీ కెమికల్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా దీనిని ప్రారంభించచ్చు. ఓ గోడౌన్ అలాగే ఓ ట్రక్ ఈ బిజినెస్ చేయడానికి మీకు కావాల్సి ఉంటుంది.
మీరు ఆర్డర్ తీసుకోవడం, ఆ తర్వాత వారికి కావాల్సిన బ్రాండ్లు, ఇతర అవసరాలను గుర్తించి కెమికల్స్ తెచ్చుకుని.. క్లీనింగ్ కోసం వాడాలి. అలానే మీరు ప్రొడక్షన్ సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసి మీ గోడౌన్ లో భద్ర పరిచి, ఎమ్మార్పీ రేటుకు అమ్ముకున్నా మీకు మంచి లాభం వస్తుంది. లేదా కొంచెం డిస్కౌంట్ ఇచ్చి అమ్మిన కూడా మీకు లాభం వస్తుంది.
సాధారణంగా ప్రొడక్షన్ కంపెనీల వద్ద మీకు కెమికల్స్ ఎమ్మార్పీ కన్నా 40 నుంచి 30 శాతం హోల్ సేల్ ధరలో మీకు లభించే చాన్స్ ఉంది. అలా చేయడం వలన మీకు కూడా మంచి ప్రాఫిట్ ఏ వస్తుంది. అలానే గోడౌన్ కోసం తక్కువ రెంట్ కలిగి ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకోవచ్చు.
తద్వారా రెంట్ డబ్బులు మిగిలే అవకాశం ఉంది. అలాగే మార్కెటింగ్ కోసం ఎగ్జిక్యూటివ్ లను పెట్టుకుంటే మీకు ఆర్డర్లు తొందరగా వస్తాయి. మీరు పెట్టుబడి కోసం ఆలోచిస్తున్నారా..? అయితే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అందిస్తున్నముద్ర రుణాల తో ఈ వ్యాపారం స్టార్ట్ చేసుకో వచ్చు. ఆ డబ్బుల తో ట్రక్ కొనుగోలు చేసుకోవచ్చు.