ఏపీలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు.. గతేడాది నవంబర్ 26 తర్వాత ఇదే తొలిసారి !

Join Our Community
follow manalokam on social media

ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1005 కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 5394 కి చేరాయి. అత్యధికంగా గుంటూరులో 225 కేసులు నమోదు కాగా తర్వాతి స్థానాల్లో చిత్తూరు, విశాఖ, కృష్ణా జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. చిత్తూరు 184, విశాఖలో 167, కృష్ణాలో 135 కేసు నమోదయ్యాయి.

ap-corona
ap-corona

13 జిల్లాల్లో కరోనా కేసులు కేసుల సంఖ్య పెరగుతోంది. గడచిన 24 గంటల్లో రికవరీ అయిన వారి సంఖ్య 324గా ఉంది. అయితే గతేడాది నవంబర్ 26 తర్వాత వేయి కేసుల నమోదు కావడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఇక కరోనా కేసులు పెరగడంతో జాగ్రత్తలు తీసుకుంటున్న పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా మాస్కు ధారణపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అలా శనివారం ఒక్క రోజునే మాస్కులు ధరించని 18,565 మందికి ఫైన్లు వేసిన పోలీసులు ఫైన్ల ద్వారా రూ. 17.34 లక్షలు వసూలు చేశారు.

TOP STORIES

శ్రీరామనవమి అంటే రాముని పుట్టిన రోజా? పెళ్ళి రోజా ?

శ్రీరామ నవమి అంటే చాలు అందరికీ పండుగే. ఆ సుగణభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. మరి నిజంగా ఆరోజే...