Business Idea : ఈ బిజినెస్‌లో ఐదు వేలు పెట్టుబడితే.. నెలకు రూ. 60 వేలు సంపాదించవచ్చు..!

-

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చేలా బిజినెస్‌ చేయాలని అందరూ అనుకుంటారు. అలాగే కొత్తగా పది మందీ చేసేది కాకుండా చేస్తే మీ బిజినెస్‌ త్వరగా క్లిక్‌ అవుతుంది. కేవలం రూ. 5 వేల పెట్టుబడితో నెలకు రూ.60 వేలకు పైగా ఆదాయం పొందే అవకాశం ఉన్న ఈ బిజినెస్ ఐడియాపై లుక్కేయండి.

ఈరోజుల్లో జనాలు షాపులకు వెళ్లి కొనుక్కోవడం మానేశారు. దొరికేకాస్త టైమ్‌ను సరుకులకు, కూరగాయాలకు అంటూ తిరిగితే వేస్ట్‌ చేసుకోవడం ఎందుకు ఇంట్లో ఉండే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టేస్తే పోలా అనుకుంటున్నారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్‌ లాంటి సంస్థలు ఆన్లైన్ ఫుడ్, నిత్యవసరాలు అందిస్తూ దూసుకుపోతున్నాయి. ఆన్లైన్లో టిఫిన్‌కు మాత్రం ఆశించినంతగా ఆర్డర్లు ఉండడం లేదు. బిర్యానీలు లాంటివి అయితే ఆర్డర్‌ చేస్తారు కానీ.. టిఫిన్‌ ఆర్డర్‌ చేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. బయట ఒక ప్లేట్‌ టిఫెన్‌ 30-50 ఉంటే.. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేస్తే.. అది ట్యాక్సులు, డెలివరీ ఛార్జెస్‌ అన్నీ కలిపి ఒక బిర్యానీ కాస్ట్‌ అవుతాందాయే. ఈ నేపథ్యంలో మీరు కూడా కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని భావిస్తే ఆన్లైన్ టిఫిన్ వ్యాపారాన్ని ప్రారంభించడం బెస్ట్ ఐడియాగా చెప్పొచ్చు

ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. కేవలం రూ. 5 నుంచి రూ. 10 వేల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కాకపోతే ఈ బిజినెస్‌కు మీరు స్థానికంగా పబ్లిసిటీ చేయడం అవసరం. మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్లు, యూపీఐ ద్వారా బిల్‌ను తీసుకోవచ్చు. ఈ వ్యాపారం కోసం మంచి వంట మాస్టర్‌ను మాత్రం నియమించుకోవాల్సి ఉంటుంది. మీకు టూ వీలర్ ఉంటే డెలివరీలు చేయొచ్చు. ఆర్డర్లు పెరుగుతున్నా కొద్దీ డెలివరీ చేయడానికి బాయ్స్‌ను నియమించుకోవచ్చు.

వర్క్ ఫ్రం హోం చేసే వారికి, బ్యాచ్‌లర్స్‌కు ఇది బాగా యూస్‌ అవుతుంది. క్వాలిటీ ఫుడ్‌ అందిస్తే.. కష్టమర్స్‌ పెరుగుతారు. సాయంత్రం స్నాక్స్ కూడా డెలివరీ చేయొచ్చు. ఈ బిజినెస్ బాగా క్లిక్ అయితే.. రోజుకు రూ.2 వేలు, నెలకు రూ.60 వేల వరకు సంపాధించే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version