ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో జనాలకు డబ్బుంటే చాలు.. ఏదైనా గ్రాండ్‌గా చేసుకోవచ్చు అనే ఆలోచన ఉంది. చిన్న ఫంక్షన్ కూడా బాగా చేయాలనుకుంటారు.. కానీ వారికి అంత టైమ్ ఉండదు. టిప్‌టాప్‌గా రెడీ అయి కుర్చుంటే చాలు అన్నీ అలా జరిగిపోవాలి అనుకుంటున్నారు.. వాళ్లు ఆలోచన మన బిజినెస్‌కు ప్లస్ పాయింట్.. పెళ్లంటే ఈ హడావిడి మాములుగా ఉండదు.. వెడ్డింగ్ ప్లానర్స్‌కు డబ్బే డబ్బు.. ఇంతకు ముందంటే..పెళ్లి పెద్దలెక్క మన బంధువులే ఉంటారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. ఒక మంచి వెడ్డింగ్ ప్లానర్స్‌ను పెట్టుకుంటే.. మొత్తం వాళ్లే చూసుకుంటారు. భోజనాలు సరిపోతాయా లేదా..? మండపంలో కుర్చీలు ఉన్నాయా లేవా..? ఇలాంటి చిన్న టెన్షన్స్ ఏం అక్కర్లేదు. మనం కేవలం వచ్చేవాళ్లను మర్యాదగా పలకరిస్తే సెట్..! మీరు ఈ బిజినెస్ చేస్తే కాస్త పని ఎక్కువున్నా లాభాలు మాత్రం పొందవచ్చు.
అలంకరణ, వేధిక, భోజనాలు ఇలా అన్నింటినీ వారే చూసుకుంటున్నారు. ఇందుకు సరిపడా డబ్బులను ముందే మాట్లాడుకుని తీసుకుంటారు వెడ్డింగ్ ప్లానర్స్. వెడ్డింగ్ ప్లానర్లలో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వారు ఆహారం, వెయిటర్లు, టెంట్లు మొదలైన ప్రాథమిక వివాహ సౌకర్యాలను అందిస్తారు. మరి కొంతమంది వెడ్డింగ్ ప్లానర్లు మొత్తం పెళ్లిని ప్లాన్ చేస్తారు. పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న పని వారే చేస్తారు.
ఇప్పుడు వెడ్డింగ్ ప్లానర్ అనేది కెరీర్ ఆప్షన్‌గా కూడా మారింది. దానికి రోజు రోజుకూ డిమాండ్ పెరగడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మీరు ఈ వ్యాపారం చేయాలనుకుంటే మీరు వెడ్డింగ్ ప్లానింగ్‌కు సంబంధించి ఏదైనా కోర్సు లేదా డిప్లొమా చేయాలి. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్నాయి. వెడ్డింగ్ ప్లానర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కోర్సు చేయక్కర్లేదు.. గతంలో వెడ్డింగ్. ప్లానర్ కంపెనీలో ఉద్యోగం చేసిన అనుభవం ఉన్నా మనం వ్యాపారం మొదలుపెట్టొచ్చు.
వెడ్డింగ్ ప్లానర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీకు తప్పనిసరిగా కార్యాలయం ఉండాలి. ప్రారంభంలో, మీరు ఇంటి వద్ద కూడా కార్యాలయాన్ని తయారు చేసుకోవచ్చు. భోజనాలు(క్యాటరింగ్), టెంట్ హౌస్‌లు, వివాహ అలంకరణ, బ్యాండ్‌లు మరియు DJ సౌండ్‌ను అందించే వ్యక్తులతో మాట్లాడుకుని అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. మీరు ఈ వ్యక్తులను మీ ఉద్యోగంలో ఉంచకుండా కమీషన్ ప్రాతిపదికన కూడా నియమించుకోవచ్చు.
ఈ బిజినెస్‌కు మనుషులు ఎక్కువగా కావాల్సి ఉంటుంది. మొదట రోజులు లెక్క తీసుకోవచ్చు. వ్యాపారం బాగున్నాక వారిని జీతానికి కూడా తీసుకోవచ్చు. DJ సౌండ్ సిస్టమ్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ, వీటిలో ఖర్చులు ఎక్కువ కాబట్టి వీటన్నింటిని వ్యాపారం బాగా సాగిన తర్వాతనే ఏర్పాటు చేసుకోవాలి.
పెట్టుబడి ఎంత?
వెడ్డింగ్ ప్లానర్ వర్క్ కూడా చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. ఈ పని చేయడానికి మంచి అనుభవం అవసరం. క్లయింట్‌లను రప్పించుకుని పెళ్లిళ్లను చక్కగా నిర్వహించగలమని మీరు భావిస్తే, మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రారంభంలో లక్ష రూపాయలు ఉంటే మీరు ఈ పనిని ప్రారంభించవచ్చు. ఈవెంట్ ఆర్డర్ ద్వారా మీరు తీసుకున్న అడ్వాన్స్‌యే పెట్టుబడిగా కూడా మార్చుకుని వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. డబ్బులనే డెకరేషన్, భోజనాలకు మీరు అడ్వాన్స్డ్‌గా ఇచ్చుకోవచ్చు.
ఎంత సంపాదించవచ్చు?
భారతదేశంలో సంవత్సరానికి 2-3 సార్లు వివాహ సీజన్ వస్తుంది. మీకు మంచి పరిచయాలు ఉంటే, మీరు నాణ్యమైన సేవను అందించడం ద్వారా ప్రారంభంలో సంవత్సరంలో ఐదు-ఆరు వివాహాల కోసం ఆర్డర్‌లను పొందినట్లయితే, మీరు ఒక వివాహానికి 1 లక్ష రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. అంటే నెలకు 50 వేలు పొందొచ్చన్నమాట. పెళ్లిళ్లే కాకుండా ఈ రోజుల్లో బర్త్‌డే పార్టీ, ఫేర్‌వెల్ పార్టీ లాంటి ఈవెంట్లు అయితే సీజన్‌తో సంబంధం లేకుండా ఉంటాయి. ఇలాంటి ఈవెంట్స్ ఆర్డర్లను పొంది డబ్బు సంపాదించవచ్చు.
ఈ బిజినెస్ సిటీల్లో అయితేనే క్లిక్ అవుతుంది. ఊర్లలో వాళ్లు వెడ్డింగ్ ప్లానర్స్‌ను నియమించుకోవడం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఉన్న ఏరియాను బట్టి వ్యాపారం చేయొచ్చు లేదో చూసుకోండి.!
Attachments area