చార్మినార్ లో వ్యాపారవేత్త హత్య.. మిత్రులే కిడ్నాప్ చేసి మరీ !

-

చార్మినార్ లో ఓ హత్య ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. చార్మినార్‌ లో ఉంటున్న ఓ వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసి మరీ హత్య చేశారు. అయితే.. ఈ హత్యను అతని మిత్రులే చేయటం గమనార్హం. ఈ కేసు వివరాల్లోకి వెళితే… ఈ నెల 19 వ తేదీన మధుసూదన్ రెడ్డి ని అతని మిత్రులే కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. మధు సూదన్ రెడ్డి దగ్గర నుంచి 40 లక్షల రూపాయల రుణం తీసుకున్న మిత్రులు. … తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగిన నేపథ్యం లో కిడ్నాప్ చేసారు అతని మిత్రులు. చార్మినార్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకు వెళ్లి సంగారెడ్డి లో హత్య చేసినట్లు తెలుస్తోంది.

మధు సూదన్ రెడ్డిని హత్య చేసి పొలంలో పాతి పెట్టారు మిత్రులు. అయితే… మధుసూదన్ రెడ్డి ని హత్య చేసిన నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు చార్మినార్ పోలీసులు. మధుసూదన్ రెడ్డి కిడ్నప్ హత్య కేసు లో నలుగురి పాత్ర ఉండగా… జగ్గనాథ్ అనే కీలక నిందితుడిని అరెస్ట్ చేసారు చార్మినార్ పోలీసులు. మధుసూదన్ రెడ్డి ను కిడ్నాప్ చేసి సంగారెడ్డి వరకు కారు లో తీసుకెళ్లిన నలుగురు కిడ్నాపర్లు.. అక్కడే చంపేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే… ఈ కేసును ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version