ధాన్యం కొనుగోలు చేయండి.. వనపర్తి జిల్లాలో రోడ్డెక్కిన రైతులు

-

రాష్ట్రంలోని రైతులు ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు.వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి వరి ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.

వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్ధారం గ్రామంలో 15రోజులైనా వరి ధాన్యం కొనకుండా.. ఎత్తుకుపోవడానికి లారీలు రావడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు.రోజులు గడుస్తున్న లారీలు రాక కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం నిలిచిపోయిందని.. రైతులపై ప్రభుత్వ మొండివైఖరి నశించి ధాన్యం కొనుగోలు చేయాలని.. చేతిలో ప్లకార్ట్స్ పట్టుకొని అధికారులు స్పందించి పరిష్కారం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news