ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిని మార్చే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది అంటూ ఈ మధ్య కాలంలో ప్రచారం జరుగుతుంది. బీజేపీ అగ్రనాయకత్వం కాస్త సోము వీర్రాజు విషయంలో సీరియస్ గా ఉండటంతో ఆయనను పదవి నుంచి తప్పించడానికి బీజేపీ పెద్దలు సిద్ధమయ్యారని అన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సమాచారం కూడా ఇచ్చారని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.
అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎవరు బాధ్యతలు చేపడతారు ఏంటనేది మాత్రం స్పష్టత రాలేదు. కానీ బీజేపీ నేతలు కొంతమంది అధ్యక్ష పదవి విషయంలో ఆసక్తికరం గా ఉన్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అలాగే రాయలసీమ జిల్లాలకు చెందిన టీజీ వెంకటేష్ ఇప్పుడు ఆ పదవి విషయంలో ఆసక్తికరంగా ఉన్నారని అంటున్నారు.
టీజీ వెంకటేష్ రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా ఆ పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఒక నేత పేరును దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి పేరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ అధిష్టానం ఖరారు చేసిందని అంటున్నారు. ఆర్ధికంగా కూడా బలంగా ఉన్న నేత కావడంతో ఆయన విషయంలో బిజెపి కాస్త సీరియస్ గానే ముందుకు వెళుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.