రంగంలోకి వాయిసేన.. రొమేనియాకు వెళ్లిన సీ-17 విమానం

-

ఉక్రెయిన్ పై క్షిప‌ణులు, బాంబుల‌తో విరుచుకుప‌డుతున్న ర‌ష్యాపై ఆంక్ష‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఆర్థికంగా ఒత్తిడి తెచ్చేందుకు ప‌లు ఆంక్ష‌లు విధించిన అమెరికా తాజాగా ర‌ష్యా విమానాల‌పై నిషేదం విధించింది. త‌మ గ‌గ‌న త‌లాన్ని వినియోగించుకోకుండా ఆంక్ష‌లు విధించింది. మ‌రొక‌వైపు త‌మ పోర్టుల్లో ర‌ష్యా నౌక‌ల‌ను నిషేదించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది ఐరోపా స‌మాఖ్య‌. ర‌ష్యా దాడిలో తీవ్రంగా దెబ్బ తిన్న ఉక్రెయిన్‌కు భారీ సాయం అందించేందుకు సిద్ధ‌మైన‌ది ప్ర‌పంచ బ్యాకు. అత్య‌వ‌స‌ర సాయం కింద 3 బిలియ‌న్ డాల‌ర్లు అందించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల‌ను త‌ర‌లించే ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రం చేసింది కేంద్ర‌ప్ర‌భుత్వం. ప్ర‌త్యేకంగా చేప‌ట్టిన ఆప‌రేష‌న్ గంగ కార్య‌క్ర‌మంలో భార‌త వాయుసేన రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సీ-17 ర‌వాణా విమానం రొమేనియాకు వెళ్లింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్, గాజియాబాద్‌లోని హిందాన్ ఎయిర్‌బేస్ నుంచి బుధ‌వారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల స‌మ‌యంలో బ‌య‌లుదేరి వెళ్లిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు.

ముఖ్యంగా ఉక్రెయిన్‌లో ఉన్న భార‌తీయుల‌ను త‌ర‌లించే అంశంపై ప్ర‌ధాని మోడీ మంగ‌ళ‌వారం మ‌రొక‌సారి ఉన్న‌త‌స్థాయి స‌మావేశం నిర్వ‌హించిన కొద్ది సేప‌టికే ఆప‌రేష‌న్‌లో గంగ‌లో వాయిసేన భాగం అవుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. దీని ద్వారా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మందిని త‌ర‌లించేందుకు వీలు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news