ఉక్రెయిన్ – రష్యా యుద్ధంతో ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతుంది. తాజా గా మరో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. తైవాన్ విషయంలో అమెరికా తలదూర్చితే.. భారీ మూల్యం తప్పదని చైనా హెచ్చరించింది. కాగ తైవాన్ ను స్వత్రంత్య దేశంగా ఉండాలని అమెరికా మద్దతు ఇస్తుంది. అయితే చైనా మాత్రం.. తైవాన్ తమ దేశంలోనే అంతర్భంగం అని వాదిస్తుంది. తైవాన్ అనేది పూర్తిగా తమ దేశ అంతరంగిక వ్యవహారం అని అంటుంది. తమ దేశ అంతరంగిక వ్యవహారంలో ఎవరూ వేలు పెట్టినా.. భారీ పరిణామాలు ఉంటాయని చైనా హెచ్చరిస్తుంది.
కాగ గత కొద్ది రోజుల కిందట.. అమెరికా దేశంలోని రక్షణ శాఖకు చెందిన కొంత మంది మాజీ అధికారులు.. తైవాన్ పర్యటించారు. దీని పై చైనా ఘటుగా స్పందించింది. తైవాన్ స్వతంత్ర్య దేశం అని అమెరికా మద్దతు ఇవ్వడం, పర్యటనలు చేయడం పై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చైనా ఆగ్రహాలను బేఖాతరు చేస్తు.. తైవాన్ విషయంలో అమెరికా ముందడుగు వేస్తుంది. దీంతో తైవాన్ ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకోవడానికి చర్యలను వేగ వంతం చేస్తుంది.