ముమైత్ నాతో అసభ్యంగా ప్రవర్తించింది.. బూతులు తిట్టింది !

-

నిన్న సినిమా నటి మొమైత్‌ ఖాన్‌ తనను మోసం చేసిందని మీడియాకి ఎక్కిన క్యాబ్ డ్రైవర్ రాజు ఈరోజు మరిన్ని విషయాలు బయట పెట్టాడు. మూడు రోజులకు గాను రూ.30 వేలకు గోవా ట్రిప్‌ మాట్లాడుకుందన్న రాజు, మూడు రోజులలో తిరిగి వస్తామని చెప్పి గోవా ట్రిప్‌కు కారు తీసుకెళ్ళిందని అన్నాడు. 5 రోజుల పాటు గోవాలో తిప్పిందని అన్నాడు. డీజిల్ ఖర్చుకు డబ్బులు అడిగినా ఇవ్వకుండా ఆమె ఇబ్బంది పెట్టిందని రాజు పేర్కొన్నారు. కారులో మద్యం, సిగరెట్లు తాగుతూ అసభ్యంగా ప్రవర్తించిందని అలా చేయొద్దన్నందుకు నన్ను బూతులు తిట్టి బెదిరించిందని రాజు పేర్కొన్నాడు.

నాకు ఇలా జరిగిందని తెలిసి మొమైత్‌ ఖాన్‌ దగ్గర గతంలో పనిచేసిన డ్రైవర్లు ఫోన్‌లు చేసి..తమను కూడా ఇబ్బంది పెట్టిందని వారి బాధలు చెప్పుకుంటున్నారని అన్నాడు. రోజు కూలీ చేసుకునే నాపట్ల ఇలా వ్యవహరిస్తుందనుకోలేదన్న రాజు ఒక సెలబ్రిటీ ఇలా వ్యవహరిస్తుందని అస్సలు అనుకో లేదని పేర్కొన్నాడు. గోవా నుంచి వచ్చిన వెంటనే 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చా నని రాజు చెప్పుకొచ్చాడు. డ్రైవర్ల అసోసియేషన్‌తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆయన పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version