మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణ.. వారు ప్రమాణ స్వీకారం..!

-

మహారాష్ట్రలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో కొత్తగా 37 మంది మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు.  నాగపూర్ లో మంత్రివర్గ విస్తరణ జరిగింది.  మహాకూటమి ప్రభుత్వంలో బీజేపీకి చెందిన 19 మంది, శివసేనకు చెందిన 11 మంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన 07 మంది మంత్రులు ప్రమాణం చేశారు.
శివసేన (షిండే వర్గం), అజిత్ పవార్ కు చెందిన ఎన్సీపీల నుంచి మంత్రి పదవులు దక్కాయి. వారందరూ ప్రమాణ స్వీకారోత్సవం చేశారు.

MH

నాగపూర్ లోని రాజ్ భవన్ లోని ఆదివారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో  గవర్నర్ సీపీ రాధాకృష్ణ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. డిసెంబర్ 05న సీఎంగా దేవేంద్ర పడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. తొలిసారిగా ఇవాళ మంత్రి వర్గ విస్తరణ జరిగింది. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version