తెలంగాణలో కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈనెల 3న విస్తరణ ఉంటుందని అంతా భావించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లారు.హస్తిన పెద్దలతో చర్చల అనంతరం టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు.
మంత్రి వర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని.. అవి తొలగిపోయి అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ తేదీని ప్రకటిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.ఈనెల 3 లేదా 4 తేదీల్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చెప్పలేదని.. అదంతా మీడియా సృష్టి అని అన్నారు. ప్రస్తుత కేబినెట్‌లో ఇద్దరు బీసీలు ఉన్నారని, మరో ఇద్దరికి అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్ గా తాను కోరానన్నారు. ఇక రాబోయే కేబినెట్ విస్తరణలో మైనార్టీకి తప్పకుండా చాన్స్ ఉంటుందన్నారు.