ప్రభుత్వానికి టెన్షన్ గా మారిన హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ !

-

పంజాగుట్ట -రాయదుర్గం మధ్య దూరం తగ్గించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రభుత్వానికే టెన్షన్ గా మారింది. ఎందుకంటే హైదరాబాద్ లో ఇలాంటి బ్రిడ్జ్ మొదటిది కావడంతో దీనికి సందర్శకులు పోటెత్తుతున్నారు. దీని దెబ్బకి ఏకంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా కరోనా టెన్షన్ పోలేదని అలా గుమి కూడవద్దని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ బ్రిడ్జ్ మీద సెల్ఫీల పిచ్చి వాహన చోదకులకు ఇబ్బందిగా మారింది.

ఎందుకంటే చీకటి పడితే చాలు విద్యుత్ కాంతులతో ధగధగా మెరిసిపోతున్న ఈ కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. వచ్చిన వారు చూసి వెళ్ళిపోకుండా బ్రిడ్జ్ మీదే కారులు, బైకులు ఆపి కాసేపు సేల్ఫీలు దిగి, ముచ్చట అంతా తీరాక గానీ వెళ్ళడం లేదు. ఈ పార్కింగ్ ఇబ్బంది పక్కన పెడితే దూసుకు వచ్చే వాహనాలను సైతం ఈ సేల్ఫీల పిచ్చలో పడి లెక్క చేయకుండా నడి రోడ్డులో నిలబడుతూ సెల్ఫీలతో హోరెత్తిస్తూ ప్రజలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసులకు ఇప్పుడు ఇదో టెన్షన్ వ్యవహారంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version