ఒక పక్క కరోనా వైరస్ దెబ్బకు రోడ్ల మీదకు రావొద్దని పోలీసులు ఎన్ని విధాలుగా వార్నింగ్ లు ఇస్తున్నా సరే జనాలు మాత్రం మారడం లేదు. ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో బయటకు వచ్చే జనం చెప్తున్నా కారణాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. అవి మరీ సిల్లీ గా ఉండటం తో పోలీసులు సీరియస్ అవుతున్నారు. ఉప్పల్ నుంచి వనస్థలీపురం వెళ్ళిన ఒక యువకుడు చెప్పిన కారణం చూసి షాక్ అయ్యారు.
తాను నాలుగు ములక్కాయలను ఇవ్వడానికి వెళ్లాను అని చెప్పగా పోలీసులు బండిని స్వాధీనం చేసుకుని అతని మీద కేసు నమోదు చేసారు. కూకట్‌పల్లి ప్రాంతంలో ఉండే ఓ యువకుడు బుధవారం వైజంక్షన్ సమీపంలోని డీ మార్ట్‌కు మంగళవారం కొనుగోలు చేసిన కట్‌డ్రాయర్‌ను మార్చుకొనేందుకు వెళ్తూ పట్టుపడ్డాడు. పోలీసులు వాహనం సీజ్ చేయడమే కాదు అతని మీద కేసులు కూడా నమోదు చేసారు.
భాగ్యనగర్‌కాలనీలోని ఓ హోటల్‌లో పనిచేసే వ్యక్తి ఎల్‌బీనగర్‌లో నివాసముండే తన సహోద్యోగికి మెడిసిన్ ఇవ్వడానికి గాను తన పాత ప్రిస్రిప్షన్ తీసుకొని వాహనంపై వెళ్తున్నాడు. దీనితో వై జంక్షన్ వద్ద పట్టుకుని వాహనం సీజ్ చేసారు. కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముండే ముగ్గురు కుటుంబ సభ్యులు కూకట్‌పల్లిలోని మెట్రో షాపింగ్ మాల్ కు వెళ్ళడానికి ప్రయత్నం చేయగా పోలీసులు కారు ఆపి సీజ్ చేసారు..