జాతి రత్నాలు సినిమాలో అతిధిగా కనిపించిన ఆ ఇద్దరు..

-

కరోనా వల్ల మనుషులందరిలో ఒక నెగెటివిటీ పేరుకుపోయింది. బయటకి వెళ్లాలన్నా భయం, ఇంట్లో ఎక్కువ సేపు ఉండాలంటే ఒత్తిడి మధ్య మనం నవ్వడం మర్చిపోయాం. మళ్ళీ పాత నవ్వులని మన ముఖాల్లో తేవడానికి జాతి రత్నాలు సినిమాని మీ ముందుకు తెస్తున్నాం అని నిర్మాత నాగ్ అశ్విన్ చెప్పాడు. చెప్పినట్టుగానే ఈ సినిమా అందరినీ బాగా నవ్విస్తుంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి మంచి రివ్యూలే వచ్చాయి. చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకుంటున్నామని రివ్యూలు పెడుతున్నారు.

ఈ సినిమాలో నవ్వులతో పాటు రెండు సర్ప్రైజ్ లు ఉన్నాయట. అవును, చాలా రోజుల నుండి వెండితెర మీద కనిపించని ఇద్దరు తారలు ఈ సినిమాతో అభిమానులని పలకరించారట. ఇద్దరు ఎవరో కాదు. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, “మహానటి” కీర్తి సురేష్. ఈ ఇద్దరూ జాతి రత్నాలు సినిమాలో కామియో పాత్రల్లో కనిపించారు. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామక్రిష్ణ, ప్రియదర్శి నటించిన ఈ సినిమాని అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు. స్వప్నా సినిమా బ్యానర్ పై రూపొందింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version