అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ భాషలలో ప్రచారం..!

-

భారతీయ అమెరికన్ల మద్దతు కోసం డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ మద్దతుదారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. వారిని ఆకర్షించేందుకు భారతీయ భాషల్లో ప్రచారాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. భారత్​లోని భాషా వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 14 భాషల్లో కార్యక్రమాలను రూపొందించనున్నట్లు ప్రకటించారు. డెమొక్రాట్లు, రిపబ్లికన్ల పోటీ అధికంగా ఉండే కీలక రాష్ట్రాలే కేంద్రంగా ఈ ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఉదాహరణకు.. “అమెరికా కా నేతా కైసా హో, జో బైడెన్​ జైసా హో” అనే నినాదాన్ని ఎంపిక చేసుకున్నారు. “అమెరికా నేత.. జో బైడెన్​లా ఉండాలి” అని దీని అర్థం.

vote
vote

అయితే ఈ విషయంలో రిపబ్లికన్లు చాలా ముందు ఉన్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లోనే ట్రంప్ రిపబ్లికన్​ పార్టీ హిందీలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. భారత ప్రధాని నరేంద్రమోదీ 2014 ఎన్నికల నినాదం “అబ్​ కి బార్ మోదీ సర్కార్” తరహాలో “అబ్​ కి బార్ ట్రంప్ సర్కార్​” అంటూ ప్రచారం కొనసాగించింది.ట్రంప్ ప్రారంభించిన నాలుగేళ్ల తర్వాత డెమొక్రాట్లు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. అయినప్పటికీ భారతీయులను అమెరికా ఎన్నికల్లో భాగస్వామ్యం చేసేందుకు ఈ డిజిటల్ కార్యక్రమం ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news