ఆస్ట్రేలియాను ఓడించి ఆఫ్గనిస్తాన్ అద్భుతం చేస్తుందా ?

-

వరల్డ్ కప్ లో మిగిలి ఉన్న రెండు సెమీస్ స్థానాల కోసం ఏకంగా నాలుగు జట్ల మధ్యన పోటీ ఉంది. అయితే ఒక స్థానం మాత్రం ఆస్ట్రేలియా దక్కించుకోవడం గ్యారంటీ అని తెలుస్తుండగా, చివరి నాలుగవ స్థానం మాత్రం న్యూజిలాండ్, పాకిస్తాన్ మరియు ఆఫ్గనిస్తాన్ లలో ఒక్కరు దక్కించుకోనున్నారు. కాగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా మరియు ఆఫ్గనిస్తాన్ లు పోటీ పడుతుండగా, ఒక్క వికెట్ కోసం ఆఫ్ఘన్ తీవ్రంగా పోరాటం చేస్తోంది. 91 పరుగులకే 7 వికెట్లను పడగొట్టిన ఆఫ్ఘన్ బౌలర్లు మాక్స్ వెల్ మరియు కమిన్స్ జోడీ దగ్గర ఆగిపోయి ఓటమికి దగ్గరలో ఉంది. ఈ మ్యాచ్ లో కనుక ఆఫ్గనిస్తాన్ ఓడిపోతే ఇక సెమీస్ కు వెళ్లడం చాలా కష్టం అయిపోతుంది.

ఓటమి కోరల్లో ఉన్న ఆస్ట్రేలియా ను సింగల్ హ్యాండెడ్ గా అద్భుతమైన విజయానికి చేరువ చేస్తున్నాడు మాక్స్ వెల్.. ఇతని విద్వంసం ముందు ఆఫ్ఘన్ బౌలర్లు అంతా తేలిపోయారు అని చెప్పాలి. అద్భుతంగా జరిగే అవకాశం ఇంకా ఉంది.. కానీ మాక్స్ వెల్ అవుట్ అవుతాడా లేదా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news