సోలార్ పవర్‌తో రైతులకి ప్లస్..సంవత్సరానికి 3 లక్షలకు పైగా లాభం..!

-

నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా రకాల లాభాలని పొందడానికి అవుతుంది. పీఎం కిసాన్ యోజన, కృషి హోండా ఇలా ఎన్నో రకాల లాభాలని అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సోలార్ ప్యానెల్ యోజన ని తీసుకు వచ్చింది. దీని వలన చక్కటి లాభాలని పొందేందుకు అవుతుంది.

ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. రైతులకు మంచి ఆదాయాన్ని తీసుకు వచ్చే మంచి మార్గం ఇది. విద్యుత్ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఎన్నో వ్యూహాలను వేస్తోంది. విద్యుత్ కోత సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి సోలార్ పీనల్ స్కీమ్‌ ని తీసుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ రైతులకు, ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. 20 లక్షల మంది రైతులకు ప్రధాన మంత్రి సోలార్ ప్యానెల్ స్కీమ్ ని ఫ్రీగా అందుబాటు లోకి వచ్చింది.

దీని ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఒక యూనిట్ విద్యుత్‌ను 30 పైసలకు విక్రయించవచ్చు. ప్రభుత్వం నుంచి 60% సబ్సిడీ కూడా లభిస్తుంది. ఒక మెగా వాట్ యూనిట్ నుంచి ఏడాదిలో 11 లక్షల యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు అవుతుంది. యూనిట్‌కు 30 పైసలు చొప్పున విక్రయిస్తే రూ.3.36 లక్షలు ఆర్జించవచ్చు. సౌరశక్తిని ఉత్పత్తి చేయడానికి 72 వేల చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది. అంటే దాదాపు ఒకటిన్నర నుంచి రెండు ఎకరాల భూమి అవసరం. 4 వేల సోలార్‌ ప్యానెల్స్‌ ని అమర్చాలి. 4 కోట్లు ఖర్చు అవుతుంది. దీని కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version