అదిరే పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. రూ.5,000 కడితే ఎనిమిది లక్షలు..!

-

పోస్ట్ ఆఫీస్ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వస్తూనే వుంది. అయితే ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన ఎన్నో లాభాలను పొందొచ్చు. అందుకే చాలా మంది తమకి నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. దీనిలో డబ్బులు పెట్టడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. మెచ్యూరిటీ సమయంలో అధిక మొత్తం వస్తుంది. అయితే పోస్ట్ ఆఫీస్ అందించే స్కీమ్స్ లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి.

దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే రూ.8 లక్షలు పొందొచ్చు. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కూడా ఒకటి. చాలా మంది ఈ స్కీమ్ లో చేరుతారు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యక్కర్లేదు.

ప్రతి నెలా కొంత మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చు. ఈ స్కీమ్ లో నెలకు రూ.100 నుంచి డిపాజిట్ చేసినా సరిపోతుంది. ఇక ఈ స్కీమ్ వడ్డీ రేటు గురించి చూస్తే.. ప్రస్తుతం 5.8 శాతం లభిస్తోంది. అయితే ఇవి మూడు నెలలకి ఒకసారి మారుతాయి. ఇక ఎవరు అర్హులు అన్నది చూస్తే.. 18 ఏళ్లకు పైన వయసు కలిగిన వారు దీనిలో చేరచ్చు.

లేదు అంటే పిల్లల పేరుపై కూడా తల్లిదండ్రులు కూడా ఓపెన్ చెయ్యచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన వారు ఐదేళ్ల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యాలి. కావాలంటే మరో ఐదేళ్లు ఎక్స్టెండ్ చేసుకోచ్చు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో సగ భాగాన్ని లోన్ గా తీసుకోచ్చు. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల రూ.8 లక్షల వరకు పొందొచ్చు. నెలకు రూ.5 వేలు డిపాజిట్ చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ సమయంలో రూ.8 లక్షలకు పైగా వస్తాయి. 5 ఏళ్లు టెన్యూర్ కన్నా ముందే స్కీమ్ నుంచి కావాలంటే బయటకి వచ్చేయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news