అదిరే స్కీమ్.. రూ.లక్షా 40 వేలు చేతికి..!

-

ఎన్నో స్కీమ్స్ మనకి అందుబాటులో వున్నాయి. అయితే మంచి స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే రాబడి కూడా బాగుంటుంది. అయితే మీరు కూడా ఏదైనా స్కీమ్ లో డబ్బులు పెట్టాలని అనుకుంటున్నారా..? ఆ స్కీమ్ ద్వారా అదిరే రాబడి పొందాలని అనుకుంటున్నారా..? అయితే మీరు ఈ స్కీమ్ గురించి చూడాల్సిందే. పైగా దీనిలో డబ్బులు పెట్టడం వలన రిస్క్ కూడా ఉండదు. పూర్తి వివరాల లోకి వెళితే..

money

పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్‌ లో తక్కువ మొత్తంలో కూడా ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించొచ్చు. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో పోస్టాఫీస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ NSC కూడా ఒకటి. ఈ స్కీమ్ పై ప్రస్తుతం 6.8 శాతం వడ్డీ రేటు వస్తోంది. మీరు రూ.1000 డిపాజిట్ చేస్తే ఐదేళ్ల తర్వాత మీకు రూ.1389.49 వస్తాయి. అంటే రూ.లక్ష పెడితే మెచ్యూరిటీలో రూ.లక్షా 40 వేలు పొందొచ్చు.

ఈ వడ్డీ రేటు ఏప్రిల్ 1 నుంచి అమలులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటుంది. మూడు నెలలకి ఒకసారి వడ్డీ రేట్లను మారుస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించొచ్చు. లేదంటే వడ్డీ రేట్లను పెంచొచ్చు. లేదంటే స్థిరంగానే ఉండచ్చు.

ఈ పధకం లో చేరాలంటే రూ.1000 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ కూడా చేసుకోచ్చు. ముగ్గురు కలిసి జాయింట్ ఖాతా తెరిచే అవకాశం కూడా ఇందులో ఉంది. మైనర్ పేరుపై కూడా ఎన్ఎస్‌సీ అకౌంట్ తెరవొచ్చు. గార్డియన్ ఉంటే సరిపోతుంది. పన్ను మినహాయింపు ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. మీరు డబ్బులు పెట్టిన దగ్గరి నుంచి ఐదేళ్లు ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ముందే బయటకి వచ్చేయచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version