జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి నుండి మూడవ విడత వారాహి యాత్రను వైజాగ్ లో మొదలు పెట్టారు. ఇక ఎప్పటిలాగే ప్రభుత్వం పై మరియు ఏపీ సీఎం జగన్ పై కొన్ని సినిమా డైలాగులు వేసి రోజును ముగించాడు. కాగా ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని వర్గాల ప్రజలు మాట్లాడుకుంటున్న మాటలు ఏమిటంటే.. ఒక రాజకీయ పార్టీని స్థాపించిన పవన్ కనీసం కొన్ని నియోజకవర్గాల ప్రజల ఆదరాభిమానాలను అయినా పొందగలిగాడా అని ? ఎందుకంటే పవన్ ఒక సినీ నటుడు కావడం వలన అందరూ మీటింగ్ లకు వస్తారు, చప్పట్లు కొడతారు , ఈలలు వేస్తారు , కానీ ఓట్లు ఎంతమంది వేస్తారు అన్నది ఇక్కడ ప్రధానమైన పాయింట్. ఆ విషయాన్ని గ్రహించడంతో పవన్ ఎక్కడున్నాడో తనకే తెలియదు. కనీసం ఎమ్మెల్యే గా కూడా ఇంకా గెలవని పవన్ కళ్యాణ్, గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యే లను మరియు 23 మంది ఎంపీ లను గెలిపించుకుని సీఎం కుర్చీ ఎక్కినా జగన్ ను మాట్లాడడానికి అర్హుడా అంటూ ప్రశ్నిస్తున్నారు.
పబ్లిక్ టాక్: పవన్ ఎమ్మెల్యేగా గెలుస్తారా
-