వన్ డే వరల్డ్ కప్ లో ఇక కేవలం ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. తుది సమరానికి అందరూ అనుకున్నట్లుగానే ఇండియా చేరుకోగా, ఆస్ట్రేలియా చాలా పట్టుదలతో ఆడి ఫైనల్ కు చేరుకుంది. ఇప్పుడు అందరూ ఆస్ట్రేలియా తో ఫైనల్ అనగానే చరిత్రను చూస్తున్నారు. ఎందుకంటే.. గతంలో 20 సంవత్సరాల క్రితం 2003 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా తో ఇండియా ఆడిన మ్యాచ్ లో 125 పరుగుల తేడాతో సౌరవ్ గంగూలీ సేన ఓటమి చెందింది. ఈ మ్యాచ్ లో రిక్కీ పాంటింగ్ సునామీ ఇన్నింగ్స్ తో ఇండియా ను ఒంటి చేత్తో ఓడించాడు. ఇపుడు ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఇండియా ఆడనున్న ఫైనల్ కావడంతో సౌరవ్ గంగూలీ ఆ రోజు సాధించలేని విజయాన్ని ఇప్పుడు రోహిత్ శర్మ కంగారూలను చెమటలు పట్టించి విజయాన్ని అందిస్తాడా అన్నది ఎదరుచూస్తున్నారు.
కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రోహిత్, షమీ లు అదే ఫామ్ ను చూపిస్తే వీరిని ఓడించడం ఎంత పని అంటూ అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. మరి జడ్జిమెంట్ డే సండే రోజున ఏమి జరగనుంది అన్నది తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.