ముగింపు ద‌శ‌కు ఐపీఎల్.. 4వ ప్లే ఆఫ్ బెర్త్ హైద‌రాబాద్‌కు ద‌క్కేనా..?

-

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ప్లే ఆఫ్స్ 4వ బెర్త్ ద‌క్క‌డం కొంత క‌ష్ట‌త‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే త‌న చివ‌రి మ్యాచ్‌లో రాజ‌స్థాన్ గెలిస్తే ఆ జ‌ట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్ల‌తో ప్లే ఆఫ్ బెర్త్ ద‌క్కాలంటే.. స‌న్‌రైజ‌ర్స్ త‌న చివ‌రి మ్యాచ్‌లో ఓడిపోవాలి.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 12వ సీజ‌న్ ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే 3 జ‌ట్లు ప్లే ఆఫ్స్ బెర్త్‌ల‌ను ఖ‌రారు చేసుకోగా, మ‌రొక బెర్త్ కోసం ఏకంగా 4 జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. చెన్నై, ముంబై, ఢిల్లీ జ‌ట్లు ప్లే ఆఫ్స్‌లో త‌మ త‌మ స్థానాల‌ను ప‌దిలం చేసుకోగా.. హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్‌, కోల్‌క‌తా, పంజాబ్‌లు మిగిలిన ఒక్క స్థానం కోసం పోటీ ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలో అన్ని జ‌ట్ల‌కు దాదాపుగా ఒక్కో మ్యాచ్ మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. కోల్‌క‌తా, పంజాబ్‌లు చెరో రెండేసి మ్యాచ్‌ల‌ను ఇంకా ఆడ‌నున్నాయి. అయితే ప్లే ఆఫ్స్‌లో మిగిలి ఉన్న ఆ ఒక్క బెర్త్‌ను ఏ జ‌ట్టు ద‌క్కించుకుంటుంద‌నే ఇప్పుడు జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది.

ఐపీఎల్ 12వ సీజ‌న్ ప్లే ఆఫ్స్‌లో మిగిలి ఉన్న ఆ ఒక్క స్థానానికి హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్‌, కోల్‌క‌తా, పంజాబ్‌లు పోటీ ప‌డుతుండ‌గా, ఇక‌పై జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లు ఉత్కంఠ భ‌రితంగా సాగ‌నున్నాయి. ప్లేయ‌ర్లు మ్యాచ్‌ల‌లో ఏ చిన్న త‌ప్పు చేసినా ప్లే ఆఫ్ బెర్త్ త‌మ‌కు అంద‌నంత దూరంగా పోతుంద‌నే విష‌యాన్ని గుర్తుంచుకుని, నెట్ ర‌న్ రేట్‌పై క‌న్నేస్తూ మ్యాచ్‌ల‌లో విజ‌యం సాధించాల్సి ఉంటుంది. అయితే హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్‌, కోల్‌క‌తా, పంజాబ్‌ల‌లో ఏ టీం ఆ ఒక్క ప్లే ఆఫ్ బెర్త్‌ను సాధిస్తుంద‌నే విష‌యాన్ని ఆయా టీంలు ఆడే మ్యాచ్‌లే తేల్చ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆయా మ్యాచ్‌ల‌లో ఏయే టీంలు ఓడిపోతే, ఏ టీంకు మిగిలిన ప్లే ఆఫ్ బెర్త్ ద‌క్కే అవ‌కాశం ఉంటుందో ఇప్పుడు ఒక లుక్కేద్దాం..!

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు 4వ బెర్త్ ద‌క్కాలంటే…

స‌న్‌రైజ‌ర్స్ చివ‌రి మ్యాచ్‌లో నెగ్గాలి. రాజ‌స్థాన్ త‌న చివ‌రి మ్యాచ్‌లో ఓడినా, నెగ్గినా ఫ‌ర్లేదు. కోల్‌క‌తా, పంజాబ్‌లు త‌మ‌కు ఉన్న చెరో రెండు మ్యాచ్‌ల‌లో కేవ‌లం ఒక్కొక్క మ్యాచ్ మాత్ర‌మే గెల‌వాలి. దీంతో 14 పాయింట్ల‌తో హైద‌రాబాద్‌, 11 లేదా 13 పాయింట్ల‌తో రాజ‌స్థాన్‌, 12 పాయింట్ల‌తో కోల్‌క‌తా, పంజాబ్‌లు ప‌ట్టిక‌లో నిలుస్తాయి. అప్పుడు హైద‌రాబాద్ కు 4వ ప్లేస్ ద‌క్కుతుంది.

రాజ‌స్థాన్‌కైతే…

రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు ప్లే ఆఫ్స్ 4వ బెర్త్ ద‌క్క‌డం కొంత క‌ష్ట‌త‌ర‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే త‌న చివ‌రి మ్యాచ్‌లో రాజ‌స్థాన్ గెలిస్తే ఆ జ‌ట్టు ఖాతాలో 13 పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్ల‌తో ప్లే ఆఫ్ బెర్త్ ద‌క్కాలంటే.. స‌న్‌రైజ‌ర్స్ త‌న చివ‌రి మ్యాచ్‌లో ఓడిపోవాలి. అలాగే కోల్‌క‌తా, పంజాబ్‌లు త‌మ‌కున్న చెరో రెండు మ్యాచ్‌ల‌లో ఒక్కో మ్యాచ్ మాత్ర‌మే గెల‌వాలి. దీంతో 13 పాయింట్ల‌తో రాజ‌స్థాన్‌, 12 పాయింట్ల‌తో హైద‌రాబాద్, కోల్‌క‌తా, పంజాబ్‌లు ఉంటాయి. ఫ‌లితంగా రాజ‌స్థాన్‌కు 4వ ప్లే ఆఫ్ బెర్త్ ల‌భిస్తుంది. కానీ ఇలా జ‌ర‌గ‌డం దాదాపుగా అసంభ‌వ‌మ‌నే అని చెప్ప‌వ‌చ్చు.

కోల్‌క‌తా, పంజాబ్‌ల‌కైతే…

రెండింటిలో ఏదైనా జ‌ట్టు త‌మ‌కున్న రెండు మ్యాచ్‌ల‌లోనూ విజ‌యం సాధించాలి. స‌న్‌రైజ‌ర్స్ ఓడిపోవాలి. రాజ‌స్థాన్ గెలిచినా, ఓడినా ఏమీ కాదు. ఇలాంటి స్థితిలో రెండు మ్యాచ్‌లు గెలిచిన జ‌ట్టు 14 పాయింట్ల‌తో, స‌న్‌రైజ‌ర్స్ 12 పాయింట్ల‌తో, రాజ‌స్థాన్ 11 లేదా 13 పాయింట్లో ప‌ట్టిక‌లో ఉంటాయి. అప్పుడు 14 పాయింట్లు ఉన్న జ‌ట్టుకు 4వ ప్లే ఆఫ్ బెర్త్ దక్కుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version