ఇండియాలో వన్ డే వరల్డ్ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందుకే మనకు అడ్వాంటేజ్ ఎక్కువగా ఉంటుందని మరియు గతంలో లాగా ఈసారి కూడా వరల్డ్ కప్ ను గెలుచుకోవచ్చని మాజీలు అభిప్రాయపడుతున్నారు. కానీ అదంతా ఈజీ కాదని ఫ్యాన్స్ అంటున్నారు.. ముఖ్యంగా ఆసియా కప్ లో బ్యాటింగ్, బౌలింగ్ మరియు ఫీల్డింగ్ ను బట్టి చూస్తే ఇవేమీ జరిగేలా లేవని ఫ్యాన్స్ మరియు కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఇక వరల్డ్ కప్ కు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టు పట్ల కూడా వ్యతిరేకత ఒక రేంజ్ లో ఉంది. ఇన్ని ప్రతికూలతలు మధ్యన ఇండియా టీం కొంచెం ఒత్తిడితోనే సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడనుంది. మరి ఇండియాలో తుది జట్టుపైనే మొత్తం ఆధారపడి ఉంటుందన్నది కొందరి వాదన. ఇక మొదటి సారి వరల్డ్ కప్ ఆడుతున్న వారు ఏడు మంది ఉన్నారని తెలిసిందే. ఈ సమీకరణాల నేపథ్యంలో యంగ్ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు దక్కుతుందా అన్నది సందేహమే.
ముఖ్యంగా ఐపీఎల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సూర్య కుమార్ యాదవ్ ను తుది జట్టులో ఆడిస్తారా ? ఒకవేళ అతన్ని ఆడించాలంటే శ్రేయాస్ అయ్యర్ లేదా రాహుల్ ను పక్కన పెట్టాలి… అంతటి సాహసం చేస్తారా అన్నది సందేహమే.