ఈ మధ్య కాలంలో థైరాయిడ్‌తో బాధపడని కుటుంబం సభ్యులు లేరంటే అతిశయోక్తి కాదు. మానవుని జీవనవిధానంలో వచ్చిన మార్పులు, జంక్ పూడ్ ఎక్కువగా తీసుకోవడం , టెంక్షన్ , నిద్రలేమి కారణంగా.. థైరాయిడ్ సమస్య పెరిగిపోతుంది. ఇవి థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి ఎన్నోన్నో రసాయన మందులు వాడిన ప్రయోజనం లేకుండా ఉండడం వల్ల ప్రజలు విసుగెత్తి పోయారు. దీనికి ఆయుర్వేద మందులు ప్రభావంతంగా పని చేస్తాయని వైద్య నిపుణులు పెర్కొన్నారు.
హైపోథైరాయిడిజమ్..
శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ పరిమాణంలో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది.కొన్నిసార్లు ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. బరువు పెరిగిపోతారు. చుట్టూ ఉన్న వారికి చెమటలు పడుతుంటే, ఈ సమస్య ఉన్నవారికి మాత్రం చలిగా అనిపిస్తుంది. వీటన్నింటితో పాటు మలబద్ధకం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, గోళ్లు విరిగిపోయినట్లు కనిపించడం, డిప్రెషన్.. పిల్లలు కలగకపోవడం, రక్తహీనత, నెలసరి సమయంలో రక్తస్రావం తక్కువ కావడం లాంటి మార్పులు కనిపిస్తాయి.
హైపర్ థైరాయిడ్ ..
థైరాయిడ్ హార్మోను ఎక్కువగా విడుదల అవుతుంది. దాంతో జీవక్రియల వేగం పెరిగి గుండెదడ, బరువు కోల్పోవడం , ఊరికే చెమటలు ఎక్కువగా పట్టడం, విరేచనాలు కావడం, కళ్ళు బయటకు వచ్చినట్లు కనిపించడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్ర పట్టక పోవడం, చేతులు వణకడం, మానసిక ఒత్తిడి, చల్లగా ఉన్న వేళల్లోనూ వేడిగా అనిపించడం, ఎక్కువగా చెమటపోయడం, నెలసరి క్రమం తప్పడం, తరచూ మూత్ర విసర్జన కు వెళ్లవలసి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
థైరాయిడ్ చికిత్సలో అశ్వగంధ చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.. ఇది హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారిలో థైరాయిడ్ స్థాయిలను మెరుగుపరుచడంలో సహాయపడుతుందని అన్నారు. అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్య రావడానికి ఒత్తిడి కూడా ఓ కారణం.
ప్రొబయోటిక్స్..
మీరు థైరాయిడ్ సమస్యకు దూరంగా ఉండటానికి, థైరాయిడ్ కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకుంటే.. ప్రొబయెటిక్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి.ఇవి ఎక్కువగా పాల ఉత్పత్తులలో దొరుకుతాయని అన్నారు. ప్రొబయోటిక్స్‌తో డిప్రెషన్, మానసిక ఒత్తిడి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆనందంగా ఉండడానికి ప్రోబయోటిక్స్ ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని పోషకారహార నిపుణులు అంటున్నారు. థయామిన్, విటమిన్ బి12, సి, ఈ ప్రోబయాటిక్స్ సీలినియం ఎక్కువగా వున్న ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడి ని గలిగించే హార్మోన్ తక్కువ విడుదల అయి ఒత్తిడి తగ్గుతుంది.
.