మనం మన దగ్గర డబ్బులు వున్నప్పుడు వాటిని బ్యాంకుల్లో పెడతాము. అవసరం అయినప్పుడు తీసేస్తూ ఉంటాం. కానీ అకౌంట్ లో డబ్బులు లేకపోతే కూడా రూ.10,000 డ్రా చేయొచ్చు. దీన్నే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారు. అయితే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం అకౌంట్ హోల్డర్స్ అందరికీ ఉండదు.
ఎక్కువగా లావాదేవీలు జరిపే వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ప్రత్యేకంగా జన్ ధన్ అకౌంట్ ని తీసుకు వచ్చారు. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ని ఇచ్చింది. జన్ ధన్ అకౌంట్ ఉన్న వారు అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉన్నా రూ.10,000 వరకు డ్రా చేయొచ్చు. పూర్తి వివరాలని చూస్తే..
2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ని తీసుకు వచ్చారు. ప్రభుత్వం అందించే ఇతర పథకాలకు చెందిన డబ్బుల్ని ఈ అకౌంట్ తో పొందచ్చు. సాధారణ సేవింగ్స్ అకౌంట్ ఇది. ఇతర సేవింగ్స్ అకౌంట్ ని బ్యాంకుల్లో తెరిస్తే మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. జన్ ధన్ అకౌంట్ ని తెరిస్తే ఫ్రీగా రూపే డెబిట్ కార్డ్ వస్తుంది. ఇదే కార్డుపై రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజీ కూడా వస్తుంది. రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా వుంది. అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా రూ.10,000 వరకు డ్రా చేసేయచ్చు.