తినేటప్పుడు నీళ్లు తాగచ్చా..? దీని వలన ఇబ్బందులు వస్తాయా..?

-

మనం తీసుకునే ఆహారం తాగే మంచినీటి పై చాలా మందికి సందేహాలు ఉంటాయి. నిజానికి మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది కనుక. అయితే చాలామంది ఆహారం తీసుకున్న తర్వాత మంచి నీళ్లు తాగుతూ ఉంటారు అలా ఆహారం తీసుకున్నాక నీళ్లు తాగడం మంచిది కాదంటారు. ఇది నిజమా కాదా అనేది ఆరోగ్యనిపుణులు మనతో చెప్పడం జరిగింది.

 

తీసుకునే ఆహారానికి ముందు కానీ తర్వాత కానీ అరగంట పాటు సమయం ఇస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. ఒకవేళ కనుక దాహం వేస్తే తాగకుండా లో ఉండిపోవాలా అనే సందేహం చాలామందిలో ఉంది. అయితే భోజనం చేస్తున్నప్పుడు కూడా నీళ్లు తాగవచ్చు.
ఎప్పుడు నీళ్లు తాగినా మంచిదే. దాహం వేస్తే అలా ఉండి పోవాల్సిన పనిలేదు.
భోజనానికి ముందు కానీ తింటున్నప్పుడు కానీ భోజనం చేసిన తర్వాత కానీ నీళ్లు తాగితే జీర్ణ ఎంజైమ్ లను పలుచన చేస్తుంది. తర్వాత జీర్ణప్రక్రియ స్లో అయిపోతుంది అని అంటారు. కానీ అది నిజం అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
కాబట్టి భోజన సమయంలో నీటిని తీసుకోకుండా ఉండాల్సిన పనిలేదు.
భోజన సమయంలో నీళ్లు తాగకూడదు అనే దాని గురించి చూస్తే… మనం తీసుకునే ఆహార పదార్థాలలో చాలా మటుకు నీరు మనకు అందుతుంది. కాబట్టి నీళ్లు తాగకూడదు అని ఎక్కడా లేదు. తాగ కూడదు అనే దాని వెనక కూడా అర్థం లేదు.
చాలా మంది భోజనం తిన్నాక నీళ్లు తాగకూడదు అని ఫాలో అవుతూ ఉంటారు. దీనివలన డీహైడ్రేషన్ కి గురయ్యే అవకాశం ఉంది. దాని మూలంగా కిడ్నీలో రాళ్లు, మలబద్దకం లాంటివి వస్తాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version