తెలుగు కెప్టెన్ మిల్లర్.. ఎప్పుడు అంటే..?

-

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా కెప్టెన్ మిల్లర్ తమిళ్ లో రిలీజ్ అయిన విషయం తెలిసిందే అక్కడ మార్నింగ్ షో నుండే కెప్టెన్ మిల్లర్ సినిమాకి హిట్ టాక్ వచ్చింది. సోషల్ మీడియా లో ధనుష్ టాప్ ట్రెండ్ అవుతున్నాడు ఎక్స్ట్రార్డినరీ మేకింగ్ తో కెప్టెన్ మిల్లర్ సినిమా ని అన్ని భాషల్లో పర్ఫెక్ట్ గా ప్రమోషన్స్ చేసి ఉన్నట్లయితే, ధనుష్ ఈ పాన్ ఇండియా సినిమా తో హిట్ కొట్టి ఉండేవాడు కానీ అది అలా జరగలేదు.

తెలుగు లో నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వడం తో థియేటర్ లో సమస్య వచ్చింది తెలుగులో కెప్టెన్ మిల్లర్ సినిమా ని రిలీజ్ చేయలేదు కెప్టెన్ మిల్లర్ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లోకి వస్తుందా లేదంటే ఓటీటీలోకి వస్తుందా అనేది కూడా ఎవరికీ తెలియలేదు. అయితే రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న తెలుగు వెర్షన్ రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సురేష్ ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news