ఓటీటీ లో అదరగొడుతున్న కెప్టెన్ మిల్లర్ మూవీ

-

అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్.కెప్టెన్ మిల్లర్ చిత్రం తెలుగులో ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో ప్రియాంకామోహన్, శివ రాజ్కుమార్, సందీప్ కిషన్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇక కెప్టెన్ మిల్లర్ మూవీ ఓటీటీ లో అదరగొడుతోంది. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ తెలుగులో మిక్స్డ్ టాక్ను తెచ్చుకుంది. FEB 9 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఫస్ట్ ప్లేస్లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్పై నిర్మించారు. కెప్టెన్ మిల్లర్ తర్వాత 2వ ప్లేస్ లో సైంధవ్, 3వ ప్లేస్ లో టైగర్-3 ఉన్నాయి.1930ల బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడే పాత్రలో హీరో ధనుష్ నటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news