నిజామాబాద్‌లో రిమాండ్ ఖైదీ సంపత్ మృతి చెందడంపై జిల్లా ఏసీపీ రాజా వెంకటరెడ్డి శుక్రవారం ఉదయం కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సంపత్ ఆసుపత్రిలోనే కుప్పకూలి చనిపోయాడు, వైద్యులు కూడా చూశారు.రిమాండ్ ఖైదీ సంపత్ మృతి పై ఎంక్వయిరీ జరుగుతోంది. ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం చేస్తారు.మృతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా, పెద్దపల్లికి చెందిన అనే వ్యక్తి గల్ఫ్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని మోసం చేశాడని అతడిపై అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పోలీసులు అరెస్టు చేసి ఇష్టానుసారంగా కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
https://twitter.com/bigtvtelugu/status/1900416802213290104