శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం సంభవించింది. హిరమండలం రిజర్వాయర్ ను ఆనుకుని ప్రవహిస్తున్న కాలువలో నిన్న అర్ధరాత్రి దాటాక జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ నాగార్జున ఫెర్టిలైజర్స్ ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉండగా ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. ఒడిశా నుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి కలువలోకి బోల్తా కొట్టడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
వివరాలు చూస్తే.. విశాఖలోని కోరమాండల్ ఫెర్టిలైజర్స్ లో ఏరియా మేనేజర్లుగా పనిచేస్తున్న రాజమండ్రివాసి పవన్ (32), ఖమ్మంవాసి బిందేటి చంద్రమోహన్ (45)తోపాటు మరో ముగ్గురు ఉద్యోగులు వెంకటగిరి ప్రసాద్, ఎం.మహేశ్వరరావు, ఎస్.దుర్గా నాగప్రవీణలు ఒడిశా రాష్ట్రం పర్లాఖిమిడిలోని సెంచూరియన్ యూనివర్సిటీలో జరిగే సమావేశానికి హాజరయ్యారు. నిన్న అర్ధరాత్రి తర్వాత తిరిగి విశాఖ ప్రయాణమయ్యారు. కారు అర్ధరాత్రి దాటాక హిరమండలం వద్దకు వచ్చేసరికి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో పవన్, చంద్రమోహన్ లు కారులోనే చనిపోయారు.