కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. అదిరే డిస్కౌంట్స్ ని ఇచ్చిన కంపెనీ..!

-

ఈ పండుగకి మీరు కొత్త కారుని కొనాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కార్లపై డిస్కౌంట్లను తీసుకు వచ్చింది హోండా కంపెనీ. కంపెనీ కార్ల అమ్మకాలు బాగా పడిన నేపథ్యంలో ఈ డిస్కౌంట్స్ ని తీసుకు వచ్చారు. 24 శాతం మేర పడిపోయాయి సేల్స్. గత నెలలో 10,125 వాహనాలను మాత్రమే కంపెనీ సేల్ చేసింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

హోండా సిటీ 5వ తరానికి చెందిన కారుపై హోండా కంపెనీ రూ.27,496 వరకు డిస్కౌంట్‌ను ఇస్తోంది. రూ.5 వేల వరకు నగదు డిస్కౌంట్, రూ.5 వేల ఎక్స్చేంజ్ ఆఫర్ కింద దీనిలో పొందొచ్చు. అలానే హోండా కస్టమర్లకు లాయల్టీ బోనస్‌గా రూ.5 వేలు, రూ.5,496 విలువైన యాక్ససరీలు ఉచితంగా వస్తాయి.

అదే నాలుగో జనరేషన్ కారుపై అయితే రూ.5 వేల డిస్కౌంట్‌ను కంపెనీ ఇస్తోంది. కానీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్ లేదు. హోండా అమేజ్‌పై అయితే రూ.8 వేల వరకు తగ్గింపును పొందొచ్చు.

రూ.5 వేల లాయల్టీ బోనస్‌ను, రూ.3 వేల కార్పొరేట్ డిస్కౌంట్‌ను కూడా కంపెనీ కల్పిస్తోంది. హోండా జాజ్‌ను కొంటె రూ.25 వేల డిస్కౌంట్‌ను పొందొచ్చు. కారు ఎక్స్చేంజ్‌పై లభించే రూ.10 వేల డిస్కౌంట్, రూ.7 వేల కారు ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది. కార్పొరేట్ డిస్కౌంట్‌గా రూ. 3 వేలు వస్తాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news