BREAKING : తిరుమల ఘాట్ రోడ్డులో‌ కారు హల్చల్‌…లోయలోకి దూకేసిన వాహనదారులు

-

BREAKING : తిరుమల ఘాట్ రోడ్డులో‌ ఓ కారు హల్చల్‌ చేసింది. అలిపిరి భద్రతా వలయంలో కారును ఆపకుండా దూసుకెళ్లారు ఆ వాహన దారులు. విజిలెన్స్ సిబ్బంది మొబైల్ వాహనం వెంటాడడంతో కారును ఘాట్ రోడ్డులో ఆపివేసి యువకులు లోయలోకి దూకినట్లు సమాచారం అందుతోంది.

దీంతో దూకిన యువకుల కోసం పోలిసులు, విజిలెన్స్ గాలిస్తున్నారు. యువకులు లోయలోకి దూకుడానికి…ప్రేమ వ్యవహారం, కిడ్నాప్ కారణంగా భావిస్తున్నారు పోలీసులు.

కారులో మొత్తం ఆరు మంది వున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ప్రస్తుతం కారులోని నలుగురు యువకులని అదుపులోకి తీసుకొని అలిపిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మరో ఇద్దరు యువకుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version