అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్..!

-

రైతులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. భాస్వరం ఎరువులు పొటాష్ ఎరువులపై కొత్త పోషక ఆధారిత రేట్లను ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే… 2022-23 రబీ సీజన్‌లో ఫాస్ఫేటిక్ మరియు పొటాష్ ఎరువులకు రూ.51,875 కోట్ల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.

2022-23 రబీ సీజన్‌లో పి అండ్ కె ఎరువులకు పోషకాల ఆధారిత సబ్సిడీ రేట్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించిందని అధికారిక ప్రకటన తెలిపింది. అయితే ఈ సమావేశంలో ఐదు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నాలుగు రకాల ఎరువులకు వేర్వేరుగా ధరలు పెట్టారు.

ఎరువులు తయారు చేయడానికి అవసరమైన పోషకాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇక ధరలను చూస్తే.. నత్రజని (ఎన్‌) కిలో రూ.98.02 ఉండగా… భాస్వరం (పి) కిలో రూ.66.93 గా వుంది. పొటాష్‌ (కె) కిలోకు రూ.23.65 ఉండగా సల్ఫర్‌ (ఎస్‌) కిలో రూ.6.12 గా నిర్ణయించింది.

అలానే దేశవాళీ ఎరువుల సరుకు రవాణా సబ్సిడీ కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే చైనా కంపెనీల నుంచి ఇథనాల్ కొనుగోలు చేసే చమురు కంపెనీల ధరలను ప్రభుత్వం పెంచాలని అనుకుంటోంది. లీటరుకు రూ.2.75 చొప్పున పెంచారు. సి హెవీ మొలాసిస్ ధరలు అయితే రూ. 46.66 నుండి 49.41 లీటర్‌కు పెంచారు. బి హెవీ మొలాసిస్‌పై లీటరుకు రూ.1.65 పెంచారు. చక్కెరతో తయారు చేసే ఇథనాల్‌పై అయితే లీటరుకు రూ.2.16 పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version